బరువు తగ్గడం సాధ్యమే - సులువే - పద్ధతి తెలుసు కోండి ప్రయత్నించండి
ఆరోగ్యం మంచిగా అవడానికి బరువు తగ్గమని డాక్టరు చెప్పారా.
తగ్గడం కష్టం అని భావించకండి.
బరువు తగ్గడం సాధ్యమే - సులువే - పద్ధతి తెలుసు కోండి ప్రయత్నించండి
బరువు తగ్గడం - సైన్సు
శరీరమునకు ఒక రోజులో చేసే పనిని బట్టి ఆహారం తీసుకొనవలసి ఉంటుంది.
ఎక్కువ ఆహారము తీసుకొంటే మీ బరువు పెరుగుతుంది.
తక్కువ ఆహారము తీసుకొంటే మీ బరువు తగ్గుతుంది.
ఆహారం - అంటే శక్తి ఎంత తీసుకోవాలి
సుమారుగా చెప్పాలంటే పురుషులు రోజుకు 2100 కెలోరీలు తీసుకోవాలి.
స్త్రీలు రోజుకు 16౦౦ కెలోరీలు తీసుకోవాలి.
తక్కువ ఆహారం - అంటే ఎంత?
పురుషులు రోజుకు 1800 కెలోరీలు తీసుకోవచ్చు.
స్త్రీలు రోజుకు 16౦౦ కెలోరీలు తీసుకోకోవచ్చు.
వ్యాయామం
తక్కువ ఆహారముతో పాటు పని కొంచెము ఎక్కువ చెయ్యవచ్చు.
ఒక గంట నడిస్తే లాభము ఎక్కువ ఉంటుంది.
ఉదయం, సాయంత్రం ఒక గంట నడిస్తే ఇంకా ఎక్కువ లాభం.
తక్కువ ఆహారం - నీరసం
తక్కువ ఆహారము తింటే నీరసము రాదా?
మీరు బరువు తగ్గాలి అని నిర్ణయము తీసుకొని పధ్ధతి అర్ధము
చేసుకుంటే త్వరగా మీరు అలవాటు పడతరు. ఇబ్బంది ఉండదు.
అనుభవం మీద చెబుతున్నాను.
నా అనుభవం
నేను 80 కిలోల నుండి 65 కిలోలకు 15 నెలలో తగ్గాను.
ఇంకా 3 కిలోలు తగ్గాలని ప్రయత్నము చేస్తున్నాను.
ఈ పద్ధతి - శాస్త్ర సమ్మతమైనది
డాక్టర్లు, రాం దేవ్ బాబా గారు, మంతెన సత్యనారాయణ రాజు గారు
ఇదే పద్ధతి చెబుతున్నారు.
మీరు వారి వీడియోలు వినండి. మీకు నచ్చితేనే ప్రయత్నం ప్రారంభించండి.
డాక్టరుని సంప్రదించండి
ప్రయత్నం ప్రారంభించే ముందు డాక్టరుని సంప్రదించండి.
ఎప్పుడు ఇబ్బంది వచ్చినా డాక్టరుని సంప్రదించండి.
ఎక్కువ నీరసం అనిపిస్తే కొంచెం ఎక్కువ ఆహారం తీసుకోండి.
ఎక్కువ ఆహారం - ఎన్ని రోజులు
ఒక వారం తీసుకోండి.
మళ్ళీ తక్కువ ఆహరం తీసుకోండి.
మరొక్క సారి
బరువు తగ్గడం సాధ్యమే - సులువే - ప్రయత్నించండి.
మీరు బరువు తగ్గుతారు .
శుభాకాంక్షలు
బరువు తగ్గడం సాధ్యమే - సులువే - పద్ధతి
__________________________________
_________________
_________________
_________________
__________________
No comments:
Post a Comment