ఆరోగ్య వేదము - ఆరోగ్య యోగము - సూర్య నమస్కారములు
1. ప్రార్థన ఆసనము
2. హస్త ఉత్తానాసనము (చేతులు పైకి ఎత్తే ముద్ర)
3. హస్తపాదాసనము (చేతి నుండి పాదాలవరకు)
4. అశ్వసంచలనాసనము
5. దండాసనము (కర్ర లాగ)
6. అష్టాంగాసనము( 8 శరీర భాగాలను తగిలించి నమస్కారం)
7. భుజంగాసనము (త్రాచుపాము)
8. పర్వతాసనము
9. అశ్వసంచలనాసనము
10. హస్తపాదాసనము (చేతి నుండి పాదాలవరకు)
11. హస్త ఉత్తానాసనము (చేతులను పైకి లేపడం)
12. తాడాసనము
1. ప్రార్థన ఆసనము
పాదాలు రెండు దగ్గరగా ఉంచి మీ బరువును రెండు పాదాల మీద సమానంగా ఉంచండి.
నమస్కారము చెయ్యండి.
2. హస్త ఉత్తానాసనము (చేతులు పైకి ఎత్తే ముద్ర)
శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకి ఎత్తి వెనుకకు తీసుకురండి. భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురండి.
మీ మడమలనుండి చేతి వేళ్ళవరకు మొత్తం శరీరాన్ని సాగతీయండి.
3. హస్తపాదాసనము (చేతి నుండి పాదాలవరకు)
నడుము నుండి ముందుకు వంగాలి.
మీ చేతులను పాదాల ప్రక్కకు భూమి మీదకు తీసుకురండి.
4. అశ్వసంచలనాసనము
కుడి కాలుని వెనకకు తోయండి.
పైకి చూడండి.
ఎడమ పాదము సరిగ్గా రెండు అరచేతులకు మధ్యలో ఉండాలి.
5. దండాసనము (కర్ర లాగ)
మొత్తం శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒక లైనులా ఉంచండి.
6. అష్టాంగాసనము( 8 శరీర భాగాలను తగిలించి నమస్కారం)
మీ చాతిని, గడ్డాన్ని భూమి మీద ఉంచండి. తుంటే భాగాన్ని కొంచెము పైకి లేపండి.
(రెండు చేతులు, రెండు పాదాలు, రెడ్ను మోకాళ్ళు, ఛాతి, మరియు గడ్డము. ఈ ఎనిమిది శరీర భాగాలు భూమిని తాకుతాయి)
7. భుజంగాసనము (త్రాచుపాము)
ముందుకు సాగి చాతిని పైకి లేపి, త్రాచుపాము ఆకారంలోకి తీసుకురండి.
8. పర్వతాసనము
చాతీ కిందకు ‘V’ (^) ఆకారములో.
తుంటి యముకను పైకి లేపాలి.
9. అశ్వసంచలనాసనము (కుడి పాదము)
కుడి పాదాన్ని రెండు చేతుల మద్యలోకి తీసుకురావాలి. పైకి చూడాలి.
.
10. హస్తపాదాసనము (చేతి నుండి పాదాలవరకు)
అరచేతులు భూమి మీద ఉంచాలి.
11. హస్త ఉత్తానాసనము (చేతులను పైకి లేపడం)
వెన్నుపూసను నిటారుగా చేసి, చేతులు పైకి లేపి కొంచెం వెనుకకు వంగి తుంటి భాగాన్ని కొద్దిగా బయటకు తోయాలి.
12. తాడాసనము
శ్వాస వదులుతూ మొట్టమొదలు శరీరాన్ని నిటారుగా తీసుకురండి. అప్పుడు చేతులు క్రిందకు తీసుకురండి. విశ్రాంతి తీసుకోండి
https://www.artofliving.org/in-te/yoga/yoga-poses/sun-salutation
No comments:
Post a Comment